భారతదేశం, జూన్ 5 -- Naga Chaitanya Dhootha 2: అక్కినేని యువ హీరో నాగచైతన్య తన డిజిటల్ డెబ్యూతోనే సంచలన విజయాన్ని అందుకున్న వెబ్ సిరీస్ 'దూత' (Dhootha). సస్పెన్స్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్ (Dhootha Chapter 2) షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఇవాళ (జూన్ 5) అధికారికంగా ప్రారంభమైంది. అయితే, ఈ సెకండ్ సీజన్‌లో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చేలా ఒక మేజర్ బిజినెస్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

ఈ క్రేజీ ప్రాజెక్టుతో నాగ చైతన్య కేవలం నటుడిగానే కాకుండా, అఫీషియల్‌గా ప్రొడ్యూసర్‌గా కొత్త అవతారమెత్తాడు. ఓటీటీ వెబ్ సిరీస్ 'దూత' మొదటి భాగాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించాడు. కానీ ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఈ సెకండ్ చాప్టర్ కోసం ప్రొడక్షన్ హ్యాండ్స...