భారతదేశం, నవంబర్ 25 -- Naga Chaitanya: సాధారణంగా వివాదాలకు, హంగామాకు దూరంగా ఉంటూ ఎంతో ప్రశాంతంగా కనిపించే నాగ చైతన్య.. తాజాగా విడుదలైన ఒక ప్రోమో వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్ 4న విడుదల కానున్న తన భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' ప్రచారం కోసం ఆయన ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాపై సుమారు ఎనిమిది గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ జాస్తి శ్రీనివాస్‌తో ముచ్చటించారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామగిరి కొండపై నడుస్తూ సాగిన ఈ సంభాషణలో నాగ చైతన్య తన కెరీర్, కుటుంబ జ్ఞాపకాలు, వ్యక్తిగత జీవితంపై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా ఏడ్చారా అనే ప్రశ్న ఎదురవగా.. చైతూ ఎంతో నిజాయితీగా స్పందించారు. తనకు కొన్ని సందర్భ...