భారతదేశం, ఏప్రిల్ 13 -- ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్, బాలీవుడ్‌లో దూసుకుపోతున్న నటి మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె నటించిన 'డెకాయిట్' (Dacoit) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్.. మృణాల్ ఠాకూర్ నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

మృణాల్‌ ఠాకూర్ ను నాగ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. "మృణాల్, నీ నటన అద్భుతం. నువ్వు ఎంచుకునే కథల విషయంలో నేను ఎప్పుడూ కాస్త ఆందోళనగా ఉంటాను. నువ్వు ఏదైనా సాదాసీదా సినిమా చేసినప్పుడు, ఇంత మంచి నటి ఇలాంటి సినిమా ఎందుకు చేస్తోంది? అనిపిస్తుంది. నీకు అంతకంటే గొప్ప పాత్రలు చేసే అర్హత ఉంది'' అని నాగ్ అశ్విన్ తెలిపాడు.

''ముఖ్యంగా భావోద్వేగాలు, లోతైన బాధ ఉన్న పాత్రలను మృణాల్ పండించే తీరు చూస్తుంటే.. నాటి మధుబాల, స...