భారతదేశం, అక్టోబర్ 31 -- Naagzilla Fraud Case Anticipatory Bail Denies: బాలీవుడ్ చిత్రపరిశ్రమలో రూ. 4 కోట్ల భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'నాగ్‌జిల్లా' షూటింగ్ ప్రాసెస్‌లో నిధుల కేటాయింపులకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది.

ఈ నాగ్‌జిల్లా ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సినిమా నిర్మాణంలో టెక్నీషియన్ల సరఫరా, వాహనాల ఏర్పాటు, జూనియర్ ఆర్టిస్టుల చెల్లింపుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

"ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరగాలంటే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది" అని అడిషనల్ సెషన్స్ ...