భారతదేశం, ఆగస్టు 10 -- మ్యూచువల్ ఫండ్లలో సిస్టెమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్​ఐపీ) ద్వారా క్రమంగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. వాటిని మధ్యలోనే ఆపేస్తున్న వారి రేషియో కూడా క్రమంగా పెరుగుతోంది! స్టాక్ మార్కెట్లో నెలకొన్న హెచ్చుతగ్గుల కారణంగానే చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మదుపర్లు తొందరపడి తగినంత సమయం ఇవ్వకుండానే ఎస్ఐపీలను రద్దు చేసుకుంటున్నట్లు డేటా స్పష్టం చేస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన డైరెక్ట్ ప్లాన్లలో ఐదేళ్లకు పైగా కొనసాగే ఎస్ఐపీలు ఎఫ్​వై26 నాటికి సుమారు 35 శాతం వరకు తగ్గాయి. అలాగే 4 నుంచి 5 సంవత్సరాల కాలం గల ఎస్ఐపీలు 23 శాతం పడిపోగా, 3 నుంచి 4 సంవత్సరాల కాలం నాటివి ఏకంగా 56 శాతం తగ్గాయి. అయితే రెండేళ్లలోపు నడుస్తున్న ఎస్ఐపీలు మాత్రం సుమారు 19 శాతం మేర పెరగడం గమ...