భారతదేశం, జూన్ 8 -- Musi River Rejuvenation Phase 2 : హైదరాబాద్ మహానగర రూపురేఖలను మార్చేసే దిశగా మూసీ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా నాగోల్ నుంచి గౌరెల్లి వరకు సెకండ్ ఫేజ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. రాబోయే వంద రోజుల్లోనే ఈ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా తొలి దశ పనులను ఇప్పటికే గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఏకంగా రూ.1,511 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఉప్పల్ భగాయత్ ఫేజ్-III లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పరిపాలనా భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు....