భారతదేశం, మే 4 -- Mukhesh Khanna: శక్తిమాన్ సీరియల్‌తో దేశవ్యాప్తంగా సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా.. తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రేమ గురించి మరోసారి స్పందించారు. 67 ఏళ్ల వయస్సులోనూ ఆయన వివాహం చేసుకోకపోవడానికి గల కారణాలను, జీవితంపై తనకున్న ఆధ్యాత్మిక దృక్పథాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
'ది ఫిల్మీ చర్చా' పాడ్‌కాస్ట్‌లో ముఖేష్ ఖన్నా.. పెళ్లి, బంధాలు, కమిట్‌మెంట్‌లపై తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా చెప్పారు. తాను వివాహ వ్యవస్థను ఎంతగానో నమ్ముతానని ముఖేష్ ఖన్నా స్పష్టం చేశారు. పెళ్లి చేసుకోకపోతే వివాహ వ్యవస్థపై నమ్మకం లేదనుకోవడం పొరపాటు అని ఆయన అన్నారు. సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిసినప్పుడు తాను పెళ్లికి సిద్ధమేనని చెప్పారు.
"నేను చాలా మంది కంటే ఎక్కువగా వివాహ వ్యవస్థను నమ్ముతాను. భార్య అనేది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.