భారతదేశం, ఏప్రిల్ 24 -- ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఘనవిజయం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక ఒక భావోద్వేగపూరితమైన కథ ఉంది. తన తల్లిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో కూడా జట్టు అవసరాల కోసం మైదానంలోకి దిగిన పేసర్ ముకేశ్ చౌదరి నిబద్ధతను చూసి క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది.

గత కొన్ని రోజులుగా 29 ఏళ్ల ముకేశ్ చౌదరి వ్యక్తిగతంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతని తల్లి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మ అంత్యక్రియల కోసం ముకేశ్ భిల్వారా వెళ్లాడు. అయితే గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో అతను సీఎస్కేకు తిరిగి ఆడాడు.

తల్లి మరణంతో గుండెను పిండేసే బాధ ఉన్నా.. ఆట కోసం, టీమ్ కోసం ముకేశ్ చౌదరి మైదానంలోకి అడుగుపెట్టడం గొప్ప విషయం. కొండంత బాధను...