భారతదేశం, ఆగస్టు 29 -- Mugguru Kothulu Title Song Released: నేటి తరం ప్రేక్షకులను, ప్రత్యేకించి కుర్రకారును అలరించేందుకు వైవిధ్యమైన యూత్‌ఫుల్ కథాంశంతో 'ముగ్గురు కోతులు' సినిమా సిద్ధమవుతోంది. శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు.

జీఎస్ఆర్ క్రియేషన్స్, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా ముగ్గురు కోతులు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందింది. ఆ క్రేజ్‌ను మరింత పెంచుతూ చిత్ర బృందం తాజాగా ముగ్గురు కోతులు ఎనర్జిటిక్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది.

విడుదలైన 'ముగ్గురు కోతులు' టైటిల్ సాంగ్ విజువల్స్ చూస్తుంటే ఇది థియేటర్లలో పక్కా ఫన్ రైడ్‌లా ఉండబోతోందని స్పష్టమవుతోంది. సింగిల్ లైఫ్‌లో ఉండే స్వేచ్ఛ, బ్యా...