భారతదేశం, సెప్టెంబర్ 19 -- Rajendra Prasad Released Mugguru Kothulu Koko Kokoroko Song: తెలుగు చిత్రసీమలో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్లకు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కొత్త నటీనటులు, వైవిధ్యమైన ఆలోచనలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'ముగ్గురు కోతులు'.

ఈ సినిమాను శోభారాణి గరిమెల్ల నిర్మించగా.. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించారు. ముగ్గురు కోతులు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో కావలసినంత ఆసక్తిని పెంచాయి.

తాజాగా ముగ్గురు కోతులు సినిమా నుంచి మాస్ ఆడియెన్స్‌ను ఊపేసే 'కోకో కొకొరొకో' అనే స్పెషల్ ఐటమ్ సాంగ్‌ను సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవి...