భారతదేశం, అక్టోబర్ 10 -- Mrunal Thakur About Katrina Kaif Kriti Sanon Trolling: చిత్రపరిశ్రమలో హీరోయిన్ల దుస్తులు, శారీరక రూపురేఖలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం, నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగడం ఈమధ్య కాలంలో బాగా ఎక్కువైంది. ఇటీవల నటీమణులు కత్రినా కైఫ్, కృతి సనన్‌లు ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ఆన్‌లైన్ దాడిపై బాలీవుడ్ భామ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇతరుల వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలని, సినిమా రంగానికి వారు అందించిన సేవలను, సాధించిన విజయాలను మర్చిపోకూడదని హితవు పలికారు మృణాల్ ఠాకూర్. తన కొత్త ఓటీటీ సినిమా పూజా మేరీ జాన్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఈ అంశంపై స్పందించారు.

"అది వారి జీవితం, వారి ఇష్టం. ప్రతీ ఒక్కరికీ తమ జీవితంలో వచ్చే ప్రతి దశను ఆస్వాదించే హక్కు ఉంటుంది. వీరిని వి...