భారతదేశం, జూలై 10 -- MRP Trailer: టాలీవుడ్ యంగ్ టాలెంట్ నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఎంఆర్‌పీ: నీకెంత నాకెంత'. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కిడ్నాప్ డ్రామాలు మనం థియేటర్లలో చాలా చూశాం. కానీ ఏకంగా ఒక శవాన్ని కిడ్నాప్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకునే ఒక పిచ్చి గ్యాంగ్ కథ ఇది. అసలు ఈ డార్క్ కామెడీ వెనుక ఉన్న స్టోరీ ఏంటి?

శ్రవణ్ జెస్తా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటెన్స్ యాక్షన్, సిచువేషనల్ కామెడీతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ జనరేషన్ ఆడియన్స్‌కి డార్క్ కామెడీ థ్రిల్లర్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. 'మత్తు వదలరా' లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నరేష్ అగస్త్...