భారతదేశం, మే 8 -- Mr Work From Home Press Meet Aravind Madhudeep: హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా ఫేమ్ త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేమ్ పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్.వి.ఎస్.ఎన్ బాబ్జీ సమర్పించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 'మిస్టర్ ...