భారతదేశం, మే 14 -- Mouni Roy: బాలీవుడ్ స్టార్ నటి, తెలుగు ప్రేక్షకులకు 'నాగిని'గా సుపరిచితురాలైన మౌనీ రాయ్ తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తన భర్త, ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది.

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న లేఖలో తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారు.

"మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రాధాన్యతలు మారడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో మా దారులను వేరు చేసుకుంటూ, పరస్పర గౌరవంతో ముందుకు సాగుతాం" అని వారు పేర్కొన్నారు. అయితే విడిపోయినప్పటికీ తమ మధ్య స్నేహం అలాగే ఉంటుందని, ఒకరినొకరు గౌరవించుకు...