Monsoon Update 2026 : వర్షాలపై ఎల్నినో ఎఫెక్ట్ - ఆలస్యం కానున్న రుతుపవనాల రాక..! తెలంగాణను ఎప్పుడు తాకుతాయంటే..?
భారతదేశం, మే 26 -- Telangana Monsoon 2026 : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈసారి కొంచెం ఆలస్యంగానే వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యం కానుంది. జూన్ ఐదో తేదీ దాటిన తర్వాతే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ముందుగా వచ్చిన అంచనాల ప్రకారం.. మే నెల చివరి నాటికే తెలంగాణ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25వ తేదీ నాడే ఇవి తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం ఒక్కసారిగా తగ్గింది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే నెల ఐదో తేదీ నుంచి పదో తే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.