భారతదేశం, జూన్ 20 -- దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, సామాన్య ప్రజలను ఊరించిన నైరుతి రుతుపవనాలు అడుగుపెడుతూనే ముఖం చాటేసాయి! సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళను తాకాల్సిన రుతుపవనాలు.. ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసిన దానికంటే ఇది ఐదు రోజులు ఆలస్యం. అయితే, కేరళలో ప్రవేశించిన మొదటి వారంలో దేశంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ, ఆ తర్వాత వీటి గమనం పూర్తిగా మందగించింది. జూన్ 1 నుంచి జూన్ 17 వరకు దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలను పరిశీలిస్తే.. దీర్ఘకాలిక సగటు వర్షపాతం కంటే ఏకంగా 38 శాతం తక్కువగా నమోదైంది! రుతుపవనాలు ఇలా సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోవడం ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా వాటా నైరుతి రుతుపవనాలదే. జూన్ మొదటి వారంలో చురుగ్గా సాగిన వీటి ప్రయ...