భారతదేశం, జూన్ 3 -- Monsoon: ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో జనం అల్లాడిపోతున్నారు. ఎండల సెగలకు తోడు ఉక్కపోతతో నరకం చూస్తున్న సామాన్యులకు, వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ ఒకేసారి కూల్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని శాసించే నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) కదలికలు వేగం పుంజుకున్నాయి. రేపు (గురువారం, జూన్ 4) ఇవి కేరళ తీరాన్ని తాకడానికి వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా మారాయి.

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలో కూడా వీటి కదలికలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింతగా రావడానికి వ...