భారతదేశం, ఏప్రిల్ 10 -- 'మహకుంభ్' వైరల్ గర్ల్ మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మోనాలిసా మైనర్ అని తేలడమే అందుకు కారణం. ఆమె ఏజ్ 18 ఏళ్ల కంటే తక్కువే అని తాజాగా నిర్ధారణ అయింది.

కుంభ మేళాలో తేనే కళ్లతో వైరల్ గా మారిన మోనాలిసా ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది లవ్ జిహాద్ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా మోనాలిసా మైనర్ అంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ చేపట్టింది. ఆమె మైనర్ అని కమిషన్ తేల్చింది.

కమిషన్ విచారణలో మోనాలిసాకు పెళ్లి అయ్యే సమయానికి ఆమె ఏజ్ 16 ఏళ్ల, 2 నెలల, 12 రోజులు మాత్రమే అని తేలింది. ఆమె 2009 డిసెంబర్ 30న సాయంత్రం 5.50 గంటలకు జన్మించిందని ప్రభుత్వ వైద్...