భారతదేశం, మే 22 -- Mohanlal: దర్శకుడు జీతూ జోసెఫ్ - మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం' ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజీ సిరీస్‌లో వచ్చిన మూడో భాగం 'దృశ్యం 3' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. సినిమా విడుదలైన రోజే మోహన్‌లాల్ పుట్టినరోజు కూడా కావడం విశేషం.

సినిమా రిలీజ్ రోజున మోహన్‌లాల్ థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమాను చూశారు. థియేటర్లో ప్రేక్షకులు సినిమాను చూస్తూ చప్పట్లతో, కేరింతలతో హోరెత్తించడంతో మోహన్‌లాల్ ఎమోషనల్ అయ్యారు.

చిత్ర బృందంతో కలిసి కూర్చున్న ఆయన.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఆనందంతో కళ్లు తుడుచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. థియేటర్లోని ఓ అభిమానికి ఆయన చేతులు జోడించి కృతజ్ఞతలు కూడా తెలిపా...