భారతదేశం, మే 10 -- పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్‌లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో అగ్రగామిగా నిలిచింది. 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలోనే అత్యధిక CEIR స్కోరును సాధించింది.

భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ, మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలను సీఈఐఆర్ అవార్డులతో సత్కరించింది.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐటీఎస్, డీడీజీ (సెక్యూరిటీ), ఏపీ ఎల్ఎస్ఏ హేమంత్ రాత్వేలతో కలిసి ఈ అవార్డులను ప్రదానం చేశారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటి యజమానులకు తిరిగి అప్పగించడంలో చేసిన విశేష కృషికి గాను పల్నాడు ఎస్పీ బి.కృష్ణారావు, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఏలూరు ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌లు ఉత్తమ రికవరీ అవార్...