MM Keeravani: ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన కీరవాణి.. బాలీవుడ్ నటుడు షేర్ చేసిన ఫొటోలు చూశారా?
భారతదేశం, నవంబర్ 13 -- MM Keeravani: బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ శుక్రవారం (నవంబర్ 13) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను పంచుకున్నారు. మొదటి స్లైడ్‌లో ఎంఎం కీరవాణి బరువు తగ్గక ముందు, తగ్గిన తర్వాత ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా.. మిగిలిన ఫోటోలలో కీరవాణితో కలిసి ఎంతో ఉత్సాహంగా పోజులిస్తూ కనిపించారు.
ఎంఎం కీరవాణి శారీరక మార్పును చూసి గర్వపడుతూ అనుపమ్ ఖేర్ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "మిస్టర్ కీరవాణి - బిఫోర్ అండ్ ఆఫ్టర్! నా అత్యంత ప్రియమైన మిత్రుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఆయన పట్టుదల నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. నా హైదరాబాద్ పర్యటనలో ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో ఫ్రెష్‌గా, పూర్తి ఉత్సాహంతో ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన నడకలో ఒక కొత్త ఉత్సాహం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.