భారతదేశం, ఆగస్టు 12 -- Mirzapur: ఓటీటీ వరల్డ్ లో సంచలనం సృష్టించిన పాపులర్ క్రైమ్ డ్రామా 'మీర్జాపూర్' ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి సిద్ధమైంది. ముంబైలో గ్రాండ్‌గా జరిగిన 'మీర్జాపూర్: ది మూవీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన విషయం మున్నా భయ్యా కంబ్యాక్.

మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 2 చివర్లో గుడ్డూ పండిట్, గోలూ గుప్తాల చేతిలో దారుణంగా దెబ్బతిని చనిపోయిన మున్నా భయ్యా పాత్ర మళ్లీ బిగ్ స్క్రీన్‌పై ప్రత్యక్షం కావడం ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ట్రైలర్ లాంచ్‌లో తన క్యారెక్టర్ రీఎంట్రీ గురించి నటుడు దివ్యేందు తన మార్క్ మున్నా భయ్యా శైలిలో స్పందించారు. "అసలు మున్నా భయ్యాను చంపేయడమే మేకర్స్ చేసిన అతిపెద్ద తప్పు, ఈ విషయంలో అందరూ ఏకీభవిస్తారు" అని సరదాగా కామెంట్ చేశారు.

"నేను పక్కా హిందీ సిని...