భారతదేశం, మే 21 -- Telangana Minimum Wages Hike 2026 : తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాది శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆ ప్రాతిపదికన వేతనాలను పెంచినట్టు తెలిపారు. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా 4 విభాగాలుగా విభజించినట్టు చెప్పారు.

ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బ...