భారతదేశం, జూలై 13 -- Michael: వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 'మైఖేల్' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత కథతో వచ్చిన ఈ హాలీవుడ్ బయోపిక్.. సినిమా హిస్టరీలోనే ఏకంగా 1 బిలియన్ డాలర్స్ (సుమారు రూ.9500 కోట్లు) క్రాస్ చేసిన ఫస్ట్ బయోపిక్‌గా గ్లోబల్ రికార్డ్ సెట్ చేసింది.

యాక్షన్ డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా అద్భుతమైన విజన్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. మొదటి రోజు నుంచే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఏప్రిల్ 2026లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. మొదట్లో క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకున్నా, ఆడియన్స్‌కు మాత్రం విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది.

ఇప్పటివరకు బయోపిక్స్ హిస్టరీలో 2018లో వచ్చిన 'బోహేమియన్ రాప్సోడీ' 911 మిలియన్ డాలర్లతో టాప్ ప్లేస్‌లో ఉండ...