భారతదేశం, జూలై 20 -- Mia Khalifa: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో అర్జెంటీనాపై స్పెయిన్ సాధించిన సంచలన విజయం మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫాకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆమె ఏకంగా 1 మిలియన్ డాలర్లు బెట్టింగ్ కాసింది. స్పెయిన్ ట్రోఫీ గెలవడంతో ఒక్క రాత్రిలోనే 1.65 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 15.9 కోట్లు) గెలుచుకుని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి మియా ఖలీఫా స్పెయిన్ యంగ్ సెన్సేషన్ లామిన్ యమల్ జెర్సీ వేసుకుని స్టేడియంలో సందడి చేసింది. తన ఒంట్లో ఒక్క చుక్క స్పానిష్ రక్తం లేకపోయినా, స్పెయిన్ గెలుపును తన సొంత దేశం విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన 1.65 ఆడ్స్ ఉన్...