భారతదేశం, ఏప్రిల్ 13 -- MI vs RCB IPL 2026 : ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఎంఐ- ఆర్సీబీ మ్యాచ్​ క్రికెట్​ అభిమానులను ఒకింత చిరాకు పెట్టింది! మ్యాచ్​ మధ్యలో ఆటగాళ్లు చాలాసార్లు బ్రేక్​ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ఫస్ట్​ ఇన్నింగ్స్​లో ముంబై ఇండియన్స్​ కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా తీసుకున్న బ్రేక్​లతో అందరు విసుగెత్తిపోయారు. ఫలితంగా ఈ టీ20 మ్యాచ్​ చాలా సుదీర్ఘంగా సాగిందన్న ఫీలింగ్​ కలిగింది. మీకు కూడా ఇదే అనిపించిందా? అనిపించడం మాత్రమే కాదు.. అది నిజం కూడా! ఇన్నేళ్ల ఐపీఎల్​ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన టీ20 మ్యాచ్​గా నిలిచింది ఈ ముంబై ఇండియన్స్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు పోరు. దీనిపై ఇప్పుడు సోషల్​ మీడియాలో విపరీతంగా ట్రోల్స్​ వస్తున్నాయి. చాలా మంది ఈ టీ20 మ్యాచ్​ని ఆదిత్య ధర్​ ధురంధర్​ రన్​టైమ్​తో పోల్చి మరీ మీమ్స్​ వేస్తున్నారు.

ఐపీ...