భారతదేశం, మే 29 -- MGNREGS Works in Telangana : రాష్ట్రంలోని పల్లెల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రస్తుతం అత్యంత వేగంగా.. జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) వరుస క్షేత్రస్థాయి సమీక్షలు, ప్రత్యేక చొరవతో ఉపాధి పనుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ నిరంతరం రంగంలోకి దిగారు. వీరు ప్రతిరోజూ అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పనులను పటిష్టంగా సమీక్షిస్తున్నారు.

మే నెల ప్రారంభంలో రాష్ట్రంలో మండుతున్న ఎండలు తీవ్రంగా ఉండటం, మొబైల్ ఫోన్ ద్వారా లైవ్ ఫొటోలు తీసే 'మొబైల్ ఫోటో క్యా...