భారతదేశం, అక్టోబర్ 14 -- దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తమ విండ్సర్ ఈవీలో సరికొత్త వర్షన్‌ను ఆవిష్కరించింది. 'ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్' పేరిట పరిచయం చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 17,99,800గా నిర్ణయించారు. అత్యంత ప్రాచుర్యం పొందిన విండ్సర్ ఈవీ మోడల్ విక్రయాలు ప్రారంభమైన 24 నెలల్లోనే ఏకంగా 80,000 కు పైగా కుటుంబాల ఆదరణ పొందడం విశేషం. ఈ అపూర్వ విజయానికి ప్రతీకగా, ఈవీ ప్రియులకు మరింత విలాసవంతమైన అనుభూతిని అందించే లక్ష్యంతోనే ఈ కొత్త వేరియంట్‌/ స్పెషల్ ఎడిషన్​ను మార్కెట్లోకి తెచ్చారు.

విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్‌కు బాహ్య రూపురేఖల పరంగా సరికొత్త 'ష్యాడో గోల్డ్' బాడీ కలర్‌ను అందించారు. దీనికి కాంట్రాస్ట్‌గా ఆల్-బ్లాక్ రూఫ్‌ను జత చేయడం...