భారతదేశం, సెప్టెంబర్ 20 -- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ'ని ప్రవేశపెట్టింది. రూ. 19.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ ప్రీమియం ఈవీ.. గరిష్టంగా రూ. 23.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. మరి మీరు ఈ ఈవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇందులోని వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన 'ఆడాప్ట్ ఎన్ఈవీ' మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన మొదటి వాహనం ఇదే కావడం విశేషం. ఈ ఆర్కిటెక్చర్ వివిధ రకాల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ సాంకేతికతలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు ప్రధాన వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణం...