భారతదేశం, నవంబర్ 24 -- పండుగలు, శుభకార్యాల వేళ నోరూరించే స్వీట్లు, పాన్‌లపై మెరిసే వెండి రేకు (Silver Foil ) చూసి టెంప్ట్ అవుతున్నారా? మీరు తింటున్నది అసలైన సిల్వర్ కోటెడ్ స్వీట్ కాదు. అది ప్రాణాంతకమైన అల్యూమినియం రేకు కావొచ్చు. ఇటీవల హెచ్-ఫాస్ట్ (H-Fast), తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) విభాగాల అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖర్చు తగ్గించుకునేందుకు కొన్ని స్వీట్ షాపులు, పాన్ విక్రయదారులు ఖరీదైన వెండి రేకు స్థానంలో చౌకగా దొరికే అల్యూమినియం షీట్లను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దీంతో మెటల్ ఫాయిల్స్ (లోహపు రేకులు) పూత ఉన్న స్వీట్లు తినడం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలపై వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకురావడానికి మాత్రమే ...