భారతదేశం, సెప్టెంబర్ 15 -- Messi Movie First Look And Glimpse Launch Event: ధామా టేల్స్ బ్యానర్‌పై ఆకర్ష ఆలపాటి సమర్పణలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా మెస్సీ- లవ్ ఫ్రమ్ ఇండియా. ఈ సినిమాను ఆకర్ష ఆలపాటి నిర్మాతగా నిర్మిస్తున్నారు.

ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మెస్సీ చిత్రంలో జమునా అబ్దు రెహ్మాన్, విజయన్ , సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అందించారు.

నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్ చేయగా అశోక్ మల్లికార్జున వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మెస్సీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అయితే, ఈ గ్లింప్స్‌ను స్కూల్ పిల్లల చేతుల మీదగా లాంచ్ చేయడం జ...