భారతదేశం, ఏప్రిల్ 25 -- Long range electric cars in India : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్​లోకి తన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ సీఎల్​ఏ సెడాన్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక 'మెర్సిడెస్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్' (ఎంఎంఏ) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన తొలి కారు ఇదే కావడం విశేషం. అదిరిపోయే రేంజ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చిన ఈ కారు వివరాలు మీకోసం..

కొత్త సీఎల్​ఏ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మూడు విభిన్న వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఒక్కో వేరియంట్ ఒక్కో రకమైన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని తయారైంది. అవి..

సీఎల్​ఏ 200 'స్టాండర్డ్ రేంజ్': బడ్జెట్ లగ్జరీ కోరుకునే వారి కోసం.

సీఎల్​ఏ 250+ 'లాంగ్ రేంజ్': అత్యధిక మైలేజ్ (రేంజ్) కావాలనుకునే వారి కోసం.

సీఎల్​ఏ 250+ 'లాంచ్ ఎడిషన్': స్పెషల్ ఫీచర్లు, అదనపు హంగులు కోరుకునే వారి కోసం....