భారతదేశం, మే 3 -- Naga Babu Getup Srinu Memu COPlam OTT Release Platform: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్, టైటిల్స్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. అయితే, ఇటీవల నాగబాబు, గెటప్ శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తెలుగు ఓటీటీ సిరీస్ మేము కాపులం టైటిల్ వివాదం అయిన విషయం తెలిసిందే.

జర్నలిస్ట్ జాఫర్‌తో గెటప్ శ్రీను చేసిన ఇంటర్వ్యూలో మేము కాపులం అనే టైటిల్ రచ్చ మొదలైంది. ఆ టైటిల్‌ను జాఫర్ తప్పుబట్టడం, గెటప్ శ్రీను కోపంతో వెళ్లిపోవడం జరిగింది. ఇదంతా నిజమా, లేక పబ్లిసిటీ స్టంటా అని చాలా అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అసలు టైటిల్ వేరే ఉందని తాజాగా రివీల్ చేశారు మేకర్స్.

అయితే, అది ఓ కులానికి సంబంధించిన మేము కాపులం కాదు పోలీసుల నేపథ్యంతో తెరకెక్కే ''మేము COPలం'' ఓటీటీ సిరీస్ అని వెల్లడించారు మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశార...