భారతదేశం, జూలై 2 -- meher ramesh: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట పెళ్లి వేడుకలు అంబరాన్నంటాయి. ఆయన కుమార్తె కృష్ణ మోహన, అనిరుధ్ ల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ వేడుకలో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెహర్ రమేష్‌కు మెగా కుటుంబంతో దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. గతంలో చిరంజీవితో 'భోలా శంకర్' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాడు మెహర్ రమేష్. ఈ బలమైన అనుబంధంతోనే మెగాస్టార్ చిరంజీవి, తన సతీమణి సురేఖతో కలిసి వివాహ వేడుకకు విచ్చేశారు. కొత్త జంటకు తమ ఆశీస్సులు అందజేశారు.

బుధవారం (జూలై 1) రాత్రి జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్ పవర్ స్ట...