భారతదేశం, సెప్టెంబర్ 11 -- సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా భారీ ఉద్యోగ నియామక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 19న కోదాడ నియోజకవర్గ కేంద్రంలోని సి.సి. రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో "మేఘా జాబ్ మేళా"ను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో భాగస్వామ్యమై యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.

కోదాడ పట్టణంలోని సి.సి. రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రోజంతా ఈ జాబ్‌మేళా కొనసాగనుంది. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ (ITI) పూర్తి చేసిన అభ్యర్థులను ఈ నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా సమీకరిస్తున్నారు. అర్హత, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన ప్యాకేజీతో అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి....