భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(ESD) విభాగం, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ (IGRS) శాఖ సేవలను మీసేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లోకి అనుసంధానించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కార్యాలయం ప్రకటించింది.

స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను ఇక వాట్సాప్ మీ సేవ ద్వారా పొందవచ్చు. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ఈ సేవలను తీసుకొచ్చినట్టుగా మీ సేవ కమిషనర్ రవికిరణ్ వెల్లడించారు.

అధికారిక మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా పలు రకాల ఐజీఆర్ఎస్ సేవలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్ పత్రం ధృవీకరించిన కాపీ, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్, స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, లోటు, సొసైటీలు, ఆర్‌టీ...