భారతదేశం, మే 17 -- Meera Vasudevan On Marriages 3 Times Wasting 17 Years: సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా, వ్యక్తిగత జీవితంలోని సమస్యల వల్ల కెరీర్‌లో అనుకున్న స్థాయికి చేరలేకపోయిన నటీమణులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు మీరా వాసుదేవన్. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న మీరా, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మూడు విఫల వివాహాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తనను కనీసం గౌరవించని మనుషుల కోసం జీవితాన్ని పణంగా పెట్టానని తెలుగు హీరోయిన్ మీరా వాసుదేవన్ చెప్పారు. జేడీ చక్రవర్తి హీరోగా చేసిన గోల్‌మాల్ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది మీరా వాసుదేవన్. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా ఇంట్రడ్యూస్ అయిన మీరా ఐ లవ్యూ అంజలి అనే మూవీలోనూ మెరిసింది.

తెలుగు, మలయాళ, తమిళ, హిందీ సినిమాల్లో రాణిస్తున్న మీరా వాసుదేవన్ రెండో భర్త జాన్ ...