భారతదేశం, మే 25 -- Meenakshi Seshadri: ఒకప్పుడు తన అద్భుత నటనతో వెండితెరను ఏలిన సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి (Meenakshi Seshadri) మళ్లీ కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరమైన ఆమె.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి తన 'కర్మభూమి' అయిన ముంబైకి చేరుకున్నారు.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంటూ, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.

చిరంజీవితో కలిసి తెలుగులో ఆపద్బాంధవుడు మూవీ చేసిన మీనాక్షి శేషాద్రి గుర్తుందా? ఆమె మళ్లీ ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో తన కుమారుడి హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొంటున్న మీనాక్షి.. అక్కడ నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోన...