భారతదేశం, ఏప్రిల్ 24 -- Meena: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన నటి మీనా. తెలుగులోనూ అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు కథా బలమున్న క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటూ, సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. అయితే ఈ మధ్య మీనా ఇల్లు గురించి తెగ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రూ.10 కోట్ల ఇల్లును రూ.100 కోట్లకు అమ్మిందనే టాపిక్ తెగ వైరల్ అయింది.

సీనియర్ నటి మీనాకు చెన్నైలోని సైదాపేట శ్రీరామ్ కాలనీలో ఓ పెద్ద బంగ్లా ఉంది. ప్యాలెస్ లా ఉన్న ఈ ఇల్లు గురించి ఇప్పుడు వార్తలు తెగ వైరల్ గా మారాయి. 20 ఏళ్ల క్రితమే మీనా ఎంతో ఇష్టంగా ఈ ఇల్లు కట్టించుకుంది. కేరళ సంప్రదాయ శైలిలో రాజభవనంలా ఈ ఇంటిని తీర్చిదిద్దుకుంది. ఇందుకు అప్పట్లో సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసిందని తెలిసింది.

రూ.10 కోట్లతో ఖర్చుతో మీనా దగ్గరుండి మరీ కట...