భారతదేశం, ఏప్రిల్ 19 -- Medha Shankr Break Girl Next Door Image: బాలీవుడ్ బ్యూటి మేధా శంకర్ కెరీర్ 2019లో 'బీచమ్ హౌస్'తో మొదలైనప్పటికీ, ఆమెకు అసలైన గుర్తింపు ఇచ్చింది మాత్రం విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన '12th ఫెయిల్' చిత్రమే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఆ సినిమాలో శ్రద్ధా జోషి పాత్రలో మేధా ఒదిగిపోయిన తీరుకు యావత్ భారతం ఫిదా అయింది.

కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 12th ఫెయిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో సోషల్ మీడియాలో మేధా శంకర్ 'నేషనల్ క్రష్'గా మారిపోయింది.

తాజాగా మేధా శంకర్ 'గిన్నీ వెడ్స్ సన్నీ 2' సినిమాలో అవినాష్ తివారీతో జతకడుతోంది. ఈ సినిమాలో మేధా ఒక సిటీ అమ్మాయిగా, అరేంజ్‌డ్ మ్యారేజ్ కోసం అబద్ధాలు ఆడే 'గిన్నీ' పాత్రలో కనిపిస్...