భారతదేశం, నవంబర్ 3 -- Mayookha 25 Days Success Celebrations: బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా "మయూఖ" (Mayookha Movie). ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. శ్రీ తేజ్ ఎస్‌కె దర్శకత్వం వహించారు.

ఇటీవలే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన "మయూఖ" సినిమా ట్రెండ్ సెట్టింగ్ థ్రిల్లర్‌గా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ తాజాగా ఈ రోజు (నవంబర్ 3) హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని "మయూఖ" సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ...