భారతదేశం, సెప్టెంబర్ 17 -- Maya Lady Teaser: 'బాహుబలి 2' సినిమాలో సేతుపతి క్యారెక్టర్‌తో గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత 'ఎవరికీ చెప్పొద్దు' లాంటి క్లీన్ రొమాంటిక్ కామిడీతో హీరోగా, ప్రొడ్యూసర్‌గా హిట్ కొట్టిన రాకేష్ వర్రే మళ్లీ బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మాయ లేడీ' టీజర్ గురువారం (సెప్టెంబర్ 17) గ్రాండ్‌గా రిలీజ్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

పెళ్లి ఈడుకొచ్చిన ఒక సగటు కుర్రాడు మంచి లైఫ్ పార్ట్‌నర్ కోసం చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వేసే సెటైర్లు, వెటకారాలు టీజర్‌లో చాలా హిలేరియస్‌గా చూపించారు. అయితే ఆ కుర్రాడి లైఫ్‌లోకి ఊహించని విధంగా ఒక క్రేజీ మైండ్ ఉన్న అమ్మాయి ఎంటర్ అవ్వడంతో అతని పక్కా ప్లానింగ్ మొత్తం త...