భారతదేశం, మే 7 -- Matka King Season 2: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన క్రైమ్ డ్రామా 'మట్కా కింగ్' మొదటి సీజన్ సాధించిన అనూహ్య విజయం తర్వాత.. మేకర్స్ తాజాగా రెండో సీజన్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో 'మట్కా కింగ్' అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గురువారం (మే 7) ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో హీరో విజయ్ వర్మ తన చేతిలో '2' అంకె ఉన్న ప్లేయింగ్ కార్డ్స్ పట్టుకుని కనిపిస్తున్నారు.

"రెండో సీజన్ కోసం కార్డులను తీస్తున్నాం" అనే క్యాప్షన్ ఇచ్చారు. మొదటి సీజన్ ముగిసిన తీరు చూస్తే రెండో భాగంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మట్కా కింగ్ బ్రిజ్ భట్టి పాత్రలో విజయ్ నటించాడు.

ప్రైమ్ ...