భారతదేశం, ఏప్రిల్ 17 -- Maruti Suzuki Ignis price : మారుతీ సుజుకీ నుంచి వచ్చిన విభిన్నమైన కార్లలో 'ఇగ్నిస్' ఒకటి. అయితే, ఈ హ్యాచ్​బ్యాక్​ ఇక భారత రోడ్లపై కనిపించకపోవచ్చు! తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇగ్నిస్ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. మారుతీ సుజుకీ ఈ కారు ఉత్పత్తిని నిశ్శబ్దంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. నెక్సా డీలర్‌షిప్స్‌లో ప్రస్తుతం ఉన్న స్టాక్ ముగియగానే, ఇగ్నిస్ అధికారికంగా మార్కెట్ నుంచి తప్పుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మారుతీ సుజుకీ సంస్థ ఈ ఇగ్నిస్​ని ఎందుకు నిలిపివేస్తోంది?

2017 జనవరిలో లాంచ్ అయిన ఇగ్నిస్.. 'అర్బన్ ఎస్‌యూవీ' ఇమేజ్‌తో యువతను ఆకట్టుకోవాలని చూసింది. కానీ, దీని వింతైన రేర్ డిజైన్ భారతీయ కొనుగోలుదారులను అంతగా మెప్పించలేకపోయింది.

అమ్మకాలలో వ్యత్యాసం: 2022లో ఇగ్నిస్ అత్యధికంగా 51,176 యూనిట్లు అమ్ముడ...