భారతదేశం, సెప్టెంబర్ 20 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్, మైక్రో ఎస్‌యూవీల విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ చిన్న సైజు ఎస్‌యూవీల కొనుగోళ్లకు వాహనదారులు విపరీతంగా మొగ్గు చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భారీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా నెక్సా నెట్‌వర్క్ ద్వారా రెండు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

మారుతీ సుజుకీ ప్రస్తుతం 'Y43' అనే కోడ్‌నేమ్‌తో ఒక మైక్రో ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఇది నెక్సా పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇగ్నిస్‌తో పోలిస్తే ఇది నిజమైన ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉంటుంది. ఎత్తైన బొనెట్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, నిలువుగా ఉండే బా...