భారతదేశం, మార్చి 27 -- ప్రభాస్ భారీ ఆశలు పెట్టుకున్న 'ది రాజా సాబ్' సినిమా దారుణంగా బోల్తా పడింది. ఈ హారర్ కామెడీ సినిమా ఈ ఏడాదికి ఫస్ట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అవుతుందని అందరూ గట్టిగా నమ్మారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వచ్చినా కూడా, ఆ తర్వాత మౌత్ టాక్ బాగా నెగెటివ్‌గా రావడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పడిపోయింది. ఈ సినిమా రిలీజైన రెండున్నర నెలల తర్వాత డైరెక్టర్ మారుతి ఫస్ట్ టైమ్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెడుతున్నట్లు చెప్పాడు.

శ్రీరామనవమి పండుగ సందర్భంగా మారుతి తన ఇంట్లో దేవుడి విగ్రహాల ముందు కూర్చున్న ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ దేవుడి పటాల ముందు తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పెట్టి, దానిపై బంతి పూలు ఉంచి ప...