భారతదేశం, మార్చి 26 -- థియేటర్లలో అదరగొట్టిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'మర్దానీ 3' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ ఫ్రాంఛైజీలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిన మర్దానీ 3 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో రాణీ ముఖర్జీ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా చిన్నపిల్లల కిడ్నాప్ చుట్టూ సాగుతుంది.

బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ లీడ్ రోల్ ప్లే చేసిన ఫీమేల్ లీడ్ మూవీ 'మర్దానీ 3'. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 27 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడైతే కేవలం హిందీలోనే సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.

బాక్సాఫీస్ ...