భారతదేశం, మార్చి 7 -- సీఎం రేవంత్ రెడ్డి ముందు 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. దేవ్‌జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు 70 ఆయుధాలను అప్పగించనున్నట్లు సమాచారం.

ఇటీవల అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అలియాస్ కుమ్మా దాదా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. అంతకుముందు లొంగిపోయిన మావోయిస్టుతో కలిసి సచివాలయంలో కొన్ని రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

దశాబ్దాల పాటు అడవిలో ఉన్న వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే ఈ అగ్రనేతలంతా నేరుగా సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది. లొంగిపోయిన నేతలు.. వారి పునరావాసం, కుటుంబాల భద్రతపై చర్చించినట్లు...