భారతదేశం, ఏప్రిల్ 7 -- దక్షిణాది చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా మలయాళం, తమిళ భాషల్లో మంజు వారియర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో 'లేడీ సూపర్ స్టార్'గా ఎదిగిన ఆమెకు సాధారణంగానే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు ఒక అభిమాని వల్ల షాకింగ్ అనుభవం ఎదురైంది. వేదికపై ఉన్న మంజు వారియర్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చిన ఓ ఫ్యాన్ ఆమెను గట్టిగా హత్తుకుని ఏకంగా పెదవులపై ముద్దు పెట్టుకున్నారు.

తాజాగా కేరళలోని పలక్కాడ్ లో ఓ జువెల్లరీ షో రూమ్ ఈవెంట్ కు మంజు వారియర్ గెస్ట్ గా వెళ్లింది. అక్కడ బయట ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడింది. ఆ సమయంలోనే ఓ లేడీ ఫ్యాన్ దూసుకొచ్చింది. మంజు వారియర్ ను హగ్ చేసుకోవడమే కాకుండా ఆమెకు లిప్ కిస్ కూడా ఇచ్చింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక...