భారతదేశం, జూలై 12 -- Mandira Bedi Emotional In Max Min Meowzaki Trailer Launch: సంగీత ప్రపంచంలో, బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన మందిరా బేడీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసిన మందిరా బేడీ అంతకుముందు క్రికెట్ వరల్డ్ కప్ హోస్టింగ్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు.

వ్యక్తిగత జీవితంలో ఎంతో ధైర్యంగా కనిపించే మందిర.. 2021లో తన భర్త, దర్శకుడు రాజ్ కౌశల్‌ను కోల్పోయాక తీవ్రమైన ఒంటరితనంలోకి జారుకున్నారు. తాజాగా ఆమె నటించిన 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్‌జాకీ' చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న మందిరా బేడీ, భర్త మరణం తర్వాత తాను అనుభవించిన నరకాన్ని గుర్తుచేసుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మందిరా బేడీ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య...